Yoga Meaning with Description, What is Yoga in Telugu

Yoga Meaning with Description, What is Yoga in Telugu.
యోగ దర్శనం

    ‘యోగ’ మన మానసిక, శారీరక సమస్యలకు చక్కని సమాధానం మనిషి యొక్క ఆహారము, ఆలోచన, ప్రవర్తన, దృష్టి, కర్మ జీవనశైలని ప్రభావితం చేసే గొప్ప సాధన – ‘యోగసాధన’ అందుకే మన పెద్దలు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు. ఈ రోజుల్లో అందరికీ మహాభాగ్యం అంటే ధనం, బంగారం, కార్లు, బంగ్లాఉ, కలిగి ఉండడమని భావిస్తారు. కాని వీటంన్నింటికంటే ముఖ్యమైన భాగ్యం. ‘ఆరోగ్యమే మహాభాగ్యము’ మనిషి సాంకేతికంగా ఎంత అభివృద్ధి సాధిస్తున్నా, తన సొంత సోత్తు అయిన ఆరోగ్యాన్ని తను కాపాడుకోలేక పోతున్నాడు. మనిషి మనుగడలో ముఖ్యంగా మానసికమైన అలజడులకు, ఆలోచనలకు మహఃభావాలకు, అధికారాలకు అధికముగా లోబడుతున్నాడు. ఈ ఘర్షణే మానసికమైన శక్తిని కోల్పోతూ ప్రపంచంలో నిరుత్సాహంగా, నిర్జీవమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఈ ఫలితంగానే శారీరకంగా ఎన్నో రుగ్మతులకు ఆహ్వానం పలుకుతున్నాడు.
    ఇటువంటి అనారోగ్యాలను ఎదుర్కొవాలంఠే మనిషి మనస్సులో మనోశక్తి, శరీరములో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకు చక్కని మార్గము మన పూర్వికులు మానవ శరీర నిర్మాణాన్ని పరిశీలించి, పరిశోధించి ఆరోగ్యానికి ఎన్నో చక్కని మార్గాలను, యోగ సాధనను, సృష్టించి అందించగలిగారు. యోగాకు పుట్టినిల్లు భారతదేశమైతే, ప్రస్తుతం ప్రాశ్చాత్తపు దేశాల్లో అద్భుతంగా ప్రచారంలో ఉంది. కానీ, ఇప్పుడిప్పుడే మన దేశంలో ఉధృతమైన ఆరాధన మొదలైనది. అందరూ ప్రకృతి పరమైన ఆహారానికి, యోగ సాధనకు పిల్లల నుండి పెద్దల వరకూ మక్కువ చూపుతున్నారు.
    ‘యోగ’ అనే పదం ‘యుజ్‌’ అనే సంస్కృత ధాతువు నుండి పుట్టింది. ‘యుజ్‌’ అంటే చేర్చ, కలుపు అని అర్ధం. శారీరక మానసిక ఆత్మ శక్తులను భగవంతునితో అనుసంధానం చేయడమే యోగం. బహు విధములైన జీవితాన్ని సముదృష్టితో చూసే మానసిక ధైర్యం అలవర్చుకోవడమే యోగ సాధన. భారతీయ తత్వజ్ఞాన ప్రకారము షడ్‌ దర్మనాలలో యోగ దర్శనం ఒకటి. భారతీయ భావనతో పరమాత్మ అంథటా వ్యాపించుంది. దానిలో జీవాత్మ ఒక అంశం’ జీవాత్మను, పరమాత్మతో అనుసంధానము చేసే మోక్షసాధనకు యోగాభ్యాసము మార్గం చూపుతుంది. ఈ యోగ మార్గాన్ని అనుసరించేవాడు యోగి లేదా యోగిని.
    భగవద్గీత యందు 6వ అధ్యాయంలో బాధ నుంచి, దుఖ నుంచి విముక్తి పొందడమే యోగం అని శ్రీకృష్ణుడు అర్జునుడకు ఉపదేశించాడు. సానపట్టిన వజ్రము పలు వర్ణాలలో ప్రకాశిస్తున్నట్లు యోగ అనే శబ్దానికి పలు అర్దాలు కలవు. ఇటువంటి యోగిన్ని సుమారు 500 సం|| నకు పూర్వమే మన సంస్కృతిలో భాగమైనది. యోగ ఈనాడు మానవ మానసిక, శారీర అసమతుల్యతల ద్వారా పొందుతున్న రోగాలకు చక్కని మార్గలను మన యోగులు, ఋషులు తపోశక్తితో సుమారు 2700 సంవత్సరముల పూర్వము కపిల మహర్షి తన శాంక్య దర్శనములో వివరించినారు. మానవ జీవితపు దుఖః హేతువులు మూడు 1) ఆత్మికము 2) భౌతికము 3) దైవికము
1) ఆత్మికము : మనము చేతులారా కొని తెచ్చుకున్న మన సమస్యలు, నమ్మకాలు, ఊహలు, ఆలోచనలు, కోరికలు ఈర్ష్య అసూయలు, రాగ, ద్వేషాలు, ఇష్టా – అయిష్టాలు, కవలోకొస్తాయి.
2) భౌతికము : ఆర్ధిక పరిస్దితులు, కలహాలు, విబేదాలు, సామర్య లోపాలు మొదలగు (భౌతికమైనది, సామాజికమైనది.
3) దైవికము : ప్రకృతి వైపరిత్యాలు, చావులు, ప్రమాదాలు, లాంటివి మనసుకు బాధ కలిగిస్తాయి. ఇవి దైవికమైనవి.
    ఇవి మానసిక దుఖాఃలకు పరిష్కారం చెప్పాడు. కపిల మహర్షి సుమారు 2400 సంవత్సరాలకు పూర్వము, అంటే కపిలుడికి 300 సంవత్సరముల అనంథరము, పతంజరి మహర్షి యోగ సూత్రాలు రాశాడు. కపిలుడు చెప్పినట్లు మనసుకే కాక శరీరాన్ని తేజోవంతముగా చేసుకోవడం ఎలాగో పతంజరి వివరించాడు. పతంజలి ‘యోగ సూత్రములు’ అనే శాస్త్రీయ గ్రంధములో 185 సూత్రాలలో పతంజలి యోగ విద్య వివరించినారు.
    మనసుని, శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకునే మార్గంలో ఎనిమిది మెట్లుగా యోగ విద్యను పతంజలి మహర్షి వివరించి చెప్పినారు. దీనినే ‘పతంజలి అష్టాంగ యోగం’ అంటారు. దీనినే యోగాభ్యాసంలోని ఎనిమిది థలు అంటారు. లక్ష్య శుద్ది ఎంత ముఖ్యమైనదో, సాధన శుద్ది కూడా అంత ముఖ్యమైనది. ఆత్మ దర్శనానికి పతంజలి అందించిన 8 అంగములు సాధనా విధానములుగా ఉపయోగపడతాయి. అవి
1)    యమము (సార్వజనీన నీతి సూత్రాలు)
2)    నియయము (క్రమ శిక్షణతో కూడిన ఆత్మశుద్ధి)
3)    ఆసనము (భంగిమ)
4)    ప్రాణాయామము (ఉచ్చాస నిశ్వాసముల లయబద్ధ నియంత్రణ)
5)     ప్రత్యాహరము (ఇంద్రియాలను అంతర్ముఖం చేయడం)
6)     ధారణ (విషయముల నుంచి మనస్సును మరలించి నిలుపుట)
7)     ధ్యానము ఏకాగ్ర మనస్సుతో చింతించుట)
8)     సమాధి (ధ్యానముతో సిద్ధించిన అతీంద్రియ శక్తితో బాహ్యా అంతర్ముఖ ప్రపంచంతో సంబంధం లేని పరమాత్మ శక్తిని అనుభూతి పొందేది.)
1) యమము : సాధకునిలో ఉద్రేక, ఉద్వేగాలను నియంత్రిచే యమము అయిదు (5) రకములుగా విభజింపబడింది. దీనినే సమాజికమైన క్రమశిక్షణ అని చెప్పవచ్చు.
ఎ) అహింస : నీవు మనసుతో, మాటలతో, ఖర్మలతో కానీ ఎవరినీ మానసికంగా శారీరకముగా హాని కలిగించకుండా ఉండడమే అహింసా పద్దతిలోని ముఖ్యాంశము.
బి) సత్యము : మనసా, వాచా, కర్మణా సత్యానికి కట్టుబడి ఉండడం.
సి) అస్థేయం : ఇతరుల అనుమతి లేకుండా వారికి సంబంధించిన వస్తువులను తీసుకోకుండా ఉండడం అంటే దొంగతనం చేయకుండుట.
డి) బ్రహ్మచర్యం : దాంపత్య జీవితమును కొనసాగిస్తూ, బ్రహ్మచర్యాన్ని కొనసాగించడం. బ్రహ్మచారిగా ఉంటూ నైష్టి బ్రహ్మచర్యాన్ని కొనసాగించడం. అంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటడమని అర్ధం.
ఇ) అపరిగ్రహము : ఇతరుల నుంచి ఏమి ఆశించకుండా ఉన్న దానితో తృప్తి పడడం. అనగా సరిపడా పొందుతూ, ఎక్కువగా కూడబెట్టకుండా ఉండటం.
2) నియమము : ప్రక్కవారితో సామరస్యంగా, అంటే పరిష్కారయుతంగా జీవించడానికి తోడ్పడే నియయము 5 విధాలుగా విభజింపబడింది. దీనినే వ్యక్తిగతమైన క్రమశిక్షణ అని చెప్పవచ్చును.
ఎ) శౌచము : శారీరక, మానసిక పరిశుభ్రతను పాటించడము బాహ్య, అంతర్‌ శుద్ధి కలిగి ఉండటం.
బి) సంతోషము : నిజ జీవితములో చేయవలసిన కర్మలను సక్రమంగా నిర్వర్తిస్తూ సంతోషముగా ఉంటము చేసే కర్మల ఫలితములకు విచారము పొందక తృప్తిగా ఉండటటమే సంతోషం.
సి) తపస్సు : మనసును మానవ అవమానముల యందు, శీతోష్ఠ సుఖ దుఃఖముల యందు, మనసును భవబాంధాల నుండి దూరముగా ఉంచి ఒకే రీతిగా సమభావం కలిగి ఉండడము.
డి) స్వాధ్యాయము : ‘ఆత్మవిచారము’ కలిగి ఉండడం అనగా తనను తాను తెలుసకోవడమే మరియు సత్‌ గ్రంధములను పఠనము చేయడం, సత్పురుషుల సాంగత్యం చేయఢం కూడా స్వాధ్యాయ మనిపించుకుంటుంది.
ఇ) ఈశ్వర ప్రణిదానము : ప్రతి పనిని ఫలాపేక్ష లేకుండా సృష్టికర్తను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ భగవంతునికి పూర్తిగా మనల్ని మనము అర్పించుకోవడం.
3) ఆసనము : ఆసనమంటే స్ధిరంగా, సుఖముగా ఒక భంగిమలో కూర్చోపెట్టేది. ఏదో ఒక భంగిమలో శరీరాన్ని కొద్దిసేపు నిశ్చలముగా ఉంచడం ద్వారా శరీర భాగములకు కావలసిన శక్తి, పని చేసే క్రమ ప్దదతి పొందుతుంది. ఆశనాలు చాలా రకాలున్నాయి. ఇవి ఇన్ని అని నిర్ణయించలేము. సృష్టిలో ప్రాణులెన్నున్నాయో అని ఆసనాలున్నాయి అని చెప్పబడుతుంది. మొత్తం 84 లక్షల ఆసనాలున్నాయంటారు. పకక్షులు, జంథువులు, క్రీములు, కీటకములను అనుసరించి ఆసనాల పేర్లు పెట్టినట్లు గమనించగలరు.
4) ప్రాణాయామము : శ్వాసను ఒక క్రమ పద్దతిలో తీసుకుంటూ వదులుతూ సమత్వరపరిచే ప్రకియ ప్రాణాయమము. ఈ పద్దతిని పాటించడం వల్ల శ్వాసక్రియ వృద్ధి చెంది చెడు వాయువు బయటకు వెళ్ళి రక్త శుద్ది జరుగుతుంది. ప్రాణాయామ క్రియవల్ల శ్వాస ఉచ్ఛ్వాసల వేగము పూర్తిగా తగ్గి ఇంచుమించుగా నిలుస్తుంది. చిత్త వృత్తులు నిరోధించబడుతాయి.
5) ప్రత్యాహారము : జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వాటి వాటి విషయాలనే సదా అనుసరిస్తాయి. చెవి శబ్దాన్ని, కన్ను దృశ్యాన్ని, ముక్కు వాసనను కోరుకుంటాయి. ఇలా ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచడమే ప్రత్యాహారమనబడుతుంది.
6)  ధారణ : మనసును కేంద్రీకరించగలడం. ఒకే ఒక చోట చిత్తాన్ని నిలపడము. ఫలితముగా మనము దేన్ని అయినా సాధించగలం అన్న నమ్మకం ఏర్పడుతుంది. మనసుతో ధరించేదే దారణ.
7) ధ్యానం : ధ్యానం ఒక రకంగా చెప్పాలంటే తదేకమైన ధారణను ధ్యానము అని చెప్పవచ్చు. మనస్సులో ధరించిన దానిపైనే ధ్యాస కలిగి ఉండటమే ధ్యానము. మానసిక ప్రశాంతతో పాటు శరీరానికి బలాన్నిచ్చే ధ్యానం అన్ని విధాలయిన అనారోగ్యాలను దూరంగా ఉంచుతుంది.
8) సమాధి : ఇది అష్టాంగ యోగములలో అత్యంత ప్రధానమైనది. దీన్ని అనువు పూర్వకముగా తెలుసుకోగలము. బాహ్య ప్రపంచంపైన కానీ, అంతర్ముఖ స్ధితులపైన కానీ, సంబంధం లేకుండా సమత్వమైన మనసు ఏర్పర్చుకోగలిగే ప్రక్రియనే సమాధి సాధన అంటారు.
    ఇవి అన్ని ఒక దానిపై ఇంకొకటి ఆధారపడి ఉన్నది. అష్టాంగములో మొదటి అంగాలు యమ, నియమ, ఆసాన, ప్రాణాయమాలు, ప్రత్యహారం బాహ్యయోగమని, ప్రత్యాహం, ధారణ, ధ్యానం చివరి 3 అంగాలు అంతర యోగ అని అంటారు. 
> ఈ యొక్క పోస్టు కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్ వ్రాయవలసినదిగా ప్రార్దన.

Leave a comment

Create a free website or blog at WordPress.com.

Up ↑